కేం‍ద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌

Former Finance Secretary Rajiv Kumar Takes Charge As Central Election Commissioner - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ కుమార్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఉపాధ్యక్షపదవికి ఆగస్టులో రాజీనామా చేసిన ఆయనను అంతకుముందున్న ఎన్నికల కమిషనర్‌ అశోక లవాసా స్థానంలో నియమించారు. ఈ సందర్బంగా రాజీవ్‌ కుమార్‌కు పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఏప్రిల్‌ 29న ఆర్థిక శాఖ కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన ఆయనను పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డు(పీఈఎస్‌బీ) ఆసియా అభివృద్ధి బ్యాంకు చైర్మన్‌గా నియమించింది. అయితే రాజీవ్‌ కుమార్‌ 1984లో జార్ఖ్ండ్‌ కేడర్‌ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధి​కారి. ఆయనకు అనేక రంగాలైన పబ్లిక్‌ పాలసీ, అడ్మినిస్టేషన్‌గా 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అదే విధంగా ఆయన మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ సస్టెనబిలిటీతో పాటు బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీల్లో ఆయన పట్టభద్రులు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top