స్కూల్‌ వ్యాను వెళ్తుండగా రోడ్డుపై పడిపోయిన ఐదుగురు విద్యార్థులు | Five schoolchildren were thrown out of a moving private school van | Sakshi
Sakshi News home page

స్కూల్‌ వ్యాను వెళ్తుండగా రోడ్డుపై పడిపోయిన ఐదుగురు విద్యార్థులు

Jun 27 2026 12:15 AM | Updated on Jun 27 2026 2:10 AM

 Five schoolchildren were thrown out of a moving private school van

బెంగళూరులోని కేఆర్ పుర సమీపంలోని గాయత్రి లేఔట్ వద్ద శుక్రవారం ఉదయం ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ వెనుక తలుపు మధ్యలోనే తెరుచుకోవడంతో ఐదుగురు విద్యార్థులు రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి.

పిల్లలు వ్యాన్ వెనుక భాగంలో కూర్చున్నారు. ప్రయాణం సాగుతుండగా వెనుక తలుపు ఒక్కసారిగా తెరుచుకోవడంతో వారు రోడ్డుపై పడిపోయారు. అదృష్టవశాత్తూ వెనుక నుంచి ఏ వాహనం రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

తర్వాత ట్రాఫిక్ పోలీసులు వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ బయలుదేరే ముందు వెనుక తలుపును సరిగా మూయకపోవడమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. అసలు ఏం జరిగిందన్న విషయంపై దర్యాప్తు సాగుతోంది.

కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ల నుంచి పిల్లలు వ్యాన్లు, ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి కూర్చొని వెళ్తూ కనపడుతుంటారు. ఈ ఏడాది ఆరంభంలో ఝార్ఖండ్‌లోని హర్ము రోడ్డుపై 10 మందికిపైగా విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ ఆటో బోల్తా పడింది. అయితే ఏ చిన్నారికీ తీవ్రమైన గాయాలు కాలేదు.

అనుమతించిన పరిమితికి మించి విద్యార్థులను తరలించే తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదురవుతున్నాయి. స్కూల్ రవాణా వాహనాలపై సరిపడా తనిఖీలు జరుగుతున్నాయా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

"భారత్‌లో 10 మంది పిల్లలు కూర్చునే సామర్థ్యం ఉన్న స్కూల్ వ్యాన్‌లో 20 మందిని ఎక్కిస్తున్నారు. ఇలా వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటి వ్యాన్‌లపై పోలీసులు జరిమానా విధించడం నేను ఇప్పటివరకు చూడలేదు" అని ఓ వ్యక్తి ఎక్స్‌లో కామెంట్‌ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement