జీఎస్‌టీ మండలి భేటీ, ఊరట లభించనుందా! | Finance Minister chairing the 44th GST Council meet  | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ మండలి భేటీ, ఊరట లభించనుందా!

Jun 12 2021 12:41 PM | Updated on Jun 12 2021 12:49 PM

Finance Minister chairing the 44th GST Council meet  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం ప్రారంభమైంది.  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో  ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు  అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు  పాల్గొంటున్నారు.  ముఖ్యంగా కోవిడ్‌ వైద్యపరికరాలు, బ్లాక్‌ఫంగస్‌ మందుల పన్నురేట్ల తగ్గింపుపై  ఈ భేటీ చర్చ జరగనుంది.  అలాగే ఆక్సిజన్‌ కొరత, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు ఇతర వస్తువులపై జీఎస్టీ రాయితీ ఇచ్చే అంశాలను గురించి చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం నిర్మలా సీతారామన్‌ మీడియాతో మాట్లాడనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement