కాంగ్రెస్‌ నేత ఇంటిపై ఈడీ దాడులు | ED Team Raid in Bhiwani Congress Leader | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేత ఇంటిపై ఈడీ దాడులు

Jul 11 2024 7:45 AM | Updated on Jul 11 2024 11:20 AM

ED Team Raid in Bhiwani Congress Leader

భివానీ: హర్యానాలోని భివానీ జిల్లాలో మైనింగ్ కాంట్రాక్టర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి దాడులు చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు మైనింగ్ కాంట్రాక్టర్ వేద్‌పాల్‌ తన్వర్, అతని సహచరుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఇప్పుడు మరోమారు భివానీ, తోషమ్‌లోని మైనింగ్ కాంట్రాక్టర్ల  ఇళ్లపై ఈడీ  అధికారులు దాడులు చేశారు.

భివానీలోని సెక్టార్-13లో ఉంటున్న మైనింగ్ కాంట్రాక్టర్, కాంగ్రెస్ నేత సత్బీర్ రాటేరా నివాసంపై ఈడీ బృందం దాడులు చేసింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈడీ బృందం సత్బీర్ రాటేరా ఇంటిపై దాడులు చేసింది. సత్బీర్ రాటేరా తన భార్య పేరిట తోషమ్‌లోని ఖానాక్, దాడం ప్రాంతంలో మైనింగ్ కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్నారు. ఆయన బవానీఖేడా అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టిక్కెట్టు ఆశిస్తున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement