Dozens Of Turtles: చేపల పెంపకం కోసం డజన్ల కొద్దీ తాబేళ్లకు విషం ఇచ్చి... చివరకు

Dozens Of Turtles Deceased At A Lake Near Mumbai - Sakshi

ముంబై: ముంబైకి సమీపంలోని సరస్సులో డజన్ల కొద్దీ తాబేళ్లను మృతి చెందాయి. అంతేకాదు తాబేళ్ల మరణానికి ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన విషమే కారణమని వన్యప్రాణుల నిపుణులు తెలిపారు. ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్యాణ్‌ నగరంలోని సరస్సు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడ స్థానిక రాజకీయ నాయకుడు ఫిర్యాదు మేరకు వైల్డ్ యానిమల్ అండ్ రెప్టైల్ రెస్క్యూ కన్జర్వేషన్ బృందం రంగంలోకి దిగింది.

అయితే ఆ సరస్సులో సుమారు 57 ఫ్లాప్‌షెల్ తాబేళ్లు చనిపోయాయని, కాగా ఆరు తాబేళ్లను రక్షించినట్లు యానిమల్ అండ్ రెప్టైల్ రెస్క్యూ కన్జర్వేషన్ బృందానికి చెందిన సుహాస్ పవార్ చెప్పారు. ఈ మేరకు సుహాస్ పవార్ మాట్లాడుతూ..."గత రెండేళ్లుగా ఉన్న కోవిడ్‌-19 ఆంక్షల కారణంగా తాబేళ్లు అధిక సంఖ్యలో పెరిగి ఉండవచ్చు. పైగా సరస్సులో కొంతమంది చేపల పెంపకం సాగిస్తున్నారు. అయితే ఇవి చేపలను తిని అధిక సంఖ్యలో పెరిగాయన్న కోపంతో స్థానికులే ఉద్దేశపూర్వకంగా విషం ఇచ్చి ఉండవచ్చు. అయితే ఈ తాబేళ్లు అరుదైనవి కావు గానీ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం రక్షిత జాతి" అని చెప్పారు. 

(చదవండి: 120 ఏళ్ల వృక్షానికి 24 గంటల కాపలా!!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top