ఆరు నెలలుగా ఆఫీస్‌కు వెళ్లకుండానే జీతం తీసుకున్న అధికారి.. సస్పెండ్ చేసిన డిప్యూటీ సీఎం

Deputy CM Suspends Officer For Taking Salary Without Going To Office - Sakshi

లక్నో: ఆఫీస్‌కు వెళ్లకుండానే ఆరు నెలలుగా జీతం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారిపై వేటు వేశారు ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్‌. ఈ విషయంపై నిర్లక్ష‍్యంగా  వ్యవహరించిన అధికారుల అందరిపైనా చర్యలకు ఉపక్రమించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు.

అమ్రోహా జిల్లాలో విధులు నిర్వహించే డా.ఇందు బాల శర్మ అనే అధికారిణి ఆర్నెళ్లుగా ఆఫీస్‌కు వెళ్లడం లేదు. కానీ రిజిస్టర్‌లో ఫేక్ సంతకాలు చేయించి జీతం మాత్రం తీసుకుంటున్నారు.  ఈ విషయం డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయి తక్షణమే చర్యలు తీసుకున్నారు.

ఈ వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం ఇప్పటికే డిపార్ట్‌మెంటల్ విచారణకు ఆదేశించింది. జిల్లా అధికారులకు జీతాలు మంజూరు చేసే అధికారి సంతోష్‌ కుమార్‌పైనా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉ‍న్న అందరు అధికారులపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు.
చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్.. చివరిరోజు తెరపైకి కొత్త పేరు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top