భూ కుంభకోణం కేసులో లాలూ కుటుంబానికి భారీ ఊరట | Delhi Rouse Avenue Court Grants Bail To Lalu Yadav And Their Sons In Land For Jobs Case | Sakshi
Sakshi News home page

భూ కుంభకోణం కేసులో లాలూ, ఆయన కుమారులకు బెయిల్‌

Oct 7 2024 11:34 AM | Updated on Oct 7 2024 12:35 PM

Delhi Rouse Avenue Court Grants Bail To Lalu Yadav And Their Sons In Land For Jobs Case

న్యూఢిల్లీ : ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్‌జేడీ చీఫ్‌, మాజీ బీహార్‌ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన ఇద్దరు కుమారులు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ లభించింది. 

ఈ మేరకు రౌస్‌ అవెన్యూ కోర్టు జస్టిస్‌ విశాల్‌ గోగ్నే షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పూచీకత్తు కింద రూ.1లక్ష చెల్లించడంతో పాటు, వారి ముగ్గురి పాస్‌పోర్ట్‌లను సరెండర్‌ చేయాలని ఆదేశించారు. కేసు విచారణ సమయంలో వారిని అరెస్టు చేయకూడదని పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement