శీతాకాల సెలవులు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం

Delhi Government Winter Break Announced In Schools From January 1 - Sakshi

సాక్షి​, న్యూఢిల్లీ: స్కూల్‌ విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం శీతాకాల సెలవులు ప్రకటించింది. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను వచ్చే ఏడాది.. జనవరి 1 నుంచి 6 వరకు స్కూల్స్‌కు శీతాకాల సెలవులు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం డెరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఓ సర్య్కూలర్‌ను విడుదల చేసింది. సాధారణంగా ప్రతి ఏడాది పాఠశాల విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం శీతాకాల సెలవులు ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే.

15 రోజులు పాటు ఉండే సెలవులను ఈసారీ 6 రోజులకే పరిమితం చేశారు. ఢిల్లీలోని తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా గత నవంబర్‌ నెల మొదట్లో 9వ తేదీ నుంచి 18వరకు స్కూల్స్‌ మూసివేసిన సంగతి విదితమే. అందుకే ప్రతి యేటా జనవరి 1 నుంచి 15 వరకు ఇవ్వాల్సిన సెలవును ఈసారి ఆరు రోజులకే తగ్గించినట్లు తెలుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top