మరో ఇద్దరు కూడా
ఢిల్లీ ప్రత్యేక కోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కాశ్మీర్ వేర్పాటువాది అసియా అంద్రాబీతోపాటు మరో ఇద్దరిని ఢిల్లీ ప్రత్యేక కోర్టు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద దోషులుగా తేల్చింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రలు సాగించినట్లు వారిపై అభియోగాలు నమోదయ్యాయి. అసియా అంద్రాబీ 1987లో మొత్తం మహిళలతో దుఖ్తరాన్ – ఇ – మిల్లత్ (డీఈఎం) అనే వేర్పాటు సంస్థను స్థాపించారు.
దేశానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొడుతున్నట్లు, యుద్ధానికి ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో కేంద్ర హోంశాఖ ఆదే శాల మేరకు 2018 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఆమెను పోలీసులు అరెస్టు చేశా రు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడంతోపా టు ఇతర ఉగ్రవాద ముఠాలకు మద్దతు ఇస్తున్న ట్లు గుర్తించారు. ‘ఉపా’ కింద కేసు నమోదు చేశారు. ఆమెతోపాటు కలిసి పనిచేస్తున్న ఇద్దరు అనుచరులను సోఫీ ఫమీదా, నహిదా నస్రీన్‌పై 2021 ఫిబ్రవరిలో కేసు నమోదయ్యింది.
అసియా అంద్రాబీతో పాటు ఆమె అనుచరులు వేర్వేరు మీడియా వేదికలను ఉపయోగించుంటూ దేశానికి వ్యతిరేకంగా ప్రజల్లో విద్వేషం రగిలిస్తున్నారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొ న్నారు. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పుగా మారారని వెల్లడించారు. ముగ్గురుని పటిష్టమైన భద్రత మధ్య బుధవారం కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఢిల్లీ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి చందర్‌జిత్ సింగ్ ప్రత్యేక ఎన్‌ఐఏ జడ్జి హోదాలో విచారణ చేపట్టారు. ఉపా సెక్షన్ 18 (కుట్రకు పాల్పడినందుకు శిక్ష), సెక్షన్ 38 (ఉగ్రవాద సంస్థలో సభ్యులుగా ఉండడం) తోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ముగ్గు రినీ దోషులుగా గుర్తించారు. న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు.


