జావద్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌: 95 రైళ్లు రద్దు

Cyclone Jawad Effect:East Coast Railway cancels 95 Trains - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: జావద్ తుపాను ఎఫెక్ట్ కారణంగా తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఈ మేరకు మొత్తం 95 రైళ్లను రద్దు చేసింది.

గురువారం రద్దు చేసిన రైళ్లు..
►సిల్చార్ త్రివేండ్రం సెంట్రల్‌, త్రివేండ్రం శాలీమార్‌,  బెంగుళూరు కంటోన్మెంట్‌- గౌహతి,  అహ్మదాబాద్‌-పూరి ఎక్స్‌ప్రెస్‌, కన్యాకుమారి- దిబ్రుఘర్‌

శుక్రవారం రద్దు చేసిన రైళ్లు
►పూరి- గుణుపూర్, భువనేశ్వర్-రామేశ్వరం, హౌరా-సికింద్రాబాద్ పలకనామ ఎక్స్‌ప్రెస్‌, పూరి-యశ్వంత్‌పూర్‌ గరీబ్ రథ్, హౌరా-యశ్వంత్ పూర్-దురంతో, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్ ప్రెస్, పురిలీయా-విల్లుపురం ఎక్స్ ప్రెస్, పురీ-తిరుపతి, హౌరా-హైదరాబాద్ -ఈస్ట్ కోస్ట్, హౌరా-చెన్నై కోరమండల్, హౌరా-మైసూర్ వీక్లీ, సంత్రాగాచ్చి-చెన్నై, విశాఖపట్నం హౌరా ఎక్స్ ప్రెస్, హౌరా-యశ్వంత్ పూర్, హౌరా-చెన్నై మెయిల్, పాట్నా-ఎర్నాకులం ఎక్స్ ప్రెస్, రాయగఢ్-గుంటూరు ఎక్స్ ప్రెస్, సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్ ప్రెస్, కొర్బా-విశాఖ.

►ధన్ బాద్-అలిప్పీ, టాటా-యశ్వంత్ పూర్, పూరీ-అహ్మదాబాద్, భువనేశ్వర్-జగదల్పూర్, చెన్నై సెంట్రల్‌-హౌరా, హైదరాబాద్-హౌరా, చెన్నై-భువనేశ్వర్, 1226 యశ్వంత్ పూర్-హౌరా-దూరంతో, సికింద్రాబాద్-హౌరా-ఫలక్ నుమా, తిరుపతి-పూరీ, యశ్వంత్ పూర్-హౌరా, సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై-హౌరా, వాస్కో-హౌరా, తిరుచురాపల్లి-హౌరా, బెంగళూర్-భువనేశ్వర్, ముంబై-భువనేశ్వర్, విశాఖ-కొర్బా, విశాఖ-రాయగఢ్, గుంటూరు-రాయగఢ్,  జగడల్ పూర్-భువనేశ్వర్, జునాఘర్ రోడ్-భువనేశ్వర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

శనివారం రోజు రద్దు అయిన రైళ్లు
►భువనేశ్వర్-ప్రశాంతి నిలయం, హాతియా-బెంగుళూరు, భువనేశ్వర్-విశాఖ, భువనేశ్వర్-సికింద్రాబాద్, గుణపూర్-పూరీ, విశాఖ – నిజాముద్దీన్- సమత ఎక్స్ ప్రెస్, విశాఖ-కిరండోల్ రైళ్లను రద్దు చేశారు. మొత్తంగా 95 రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top