
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 76,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 34,63,973 చేరింది. గడిచిన 24 గంటల్లో 1,021 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 62,550కు చేరింది. వైరస్‌బారిన పడ్డవారిలో ఇప్పటివరకు 26,48,999 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,52,424 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(చదవండి : తెలంగాణలో కొత్తగా 2,751 కేసులు, 9 మరణాలు)