చంద్రయాన్‌-1 మిషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ హెగ్డే కన్నుమూత Srinivas Hegde, the mission director of India's first moon mission Chandrayaan-1, passed away. Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-1 మిషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ హెగ్డే కన్నుమూత

Published Sat, Jun 15 2024 7:50 AM | Last Updated on Sat, Jun 15 2024 12:35 PM

Chandrayaan 1 Mission Director Passes Away

భారతదేశానికి చెందిన చంద్రయాన్-1 మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ హెగ్డే శుక్రవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.  శ్రీనివాస్‌ హెగ్డే మూడు దశాబ్దాలకు పైగా (1978 నుండి 2014) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పనిచేశారు.

ఈ సమయంలో అంతరిక్ష సంస్థ నిర్వహించిన అనేక చారిత్రాత్మక మిషన్లలో కీలక పాత్ర పోషించారు. వాటిలో ముఖ్యమైనది 2008లో చేపట్టిన చంద్రయాన్-1. ఇది చంద్రునిపై నీటి అణువులను గుర్తించింది. శ్రీనివాస్‌ హెగ్డే పదవీ విరమణ  అనంతరం బెంగళూరుకు చెందిన స్టార్టప్ టీమ్ ఇండస్‌లో చేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement