CBSE 12వ తరగతి ఫలితాలు 2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలను ఈ రోజు ( బుధవారంమే 13, 2026)న ప్రకటించింది. ఈ ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 85.20 శాతంగా నమోదైంది.
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ results.cbse.nic.in ద్వారా తమ మార్కుల పత్రాన్ని (marksheet) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఉత్తీర్ణత శాతం తగ్గుదల
సీబీఎస్‌ఈ బోర్డు 12వ తరగతి పరీక్షలల ఉత్తీర్ణత శాతం గత ఏceదితో పోలిస్తే ఈ సంవత్సరం తగ్గుముఖం పట్టింది. 2026లో, మొత్తం 17,80,365 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, వారిలో 17,68,968 మంది పరీక్షకు హాజరయ్యారు వీరిలో 15,07,109 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దీంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 85.20 శాతానికి చేరింది. గత సంవత్సరం, మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39 శాతంగా నమోదైంది. మొత్తం 14,96,307 మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 2025తో పోలిస్తే మొత్తం ఉత్తీర్ణత శాతంలో ఇది 3.19 శాతం తగ్గుదలను సూచిస్తుంది.
ముఖ్యాంశాలు
మొత్తం ఉత్తీర్ణత శాతం 85.20గా ఉంది. 2025తో పోలిస్తే ఇది 3.19శాతం తక్కువ.
బాలుర కంటే బాలికలు 6.73శాతం మెరుగైన ఫలితాలను కనబరిచారు.
త్రివేండ్రం అత్యధికంగా 95.62శాతం ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేయగా, ప్రయాగ్‌రాజ్ అత్యల్పంగా 72.43శాతం శాతాన్ని నమోదు చేసింది.
90 శాతానికి పైగా మార్కులు సాధించినవారు 94వేల మందికి పైగా ఉన్నప్పటికీ ఉత్తీర్ణత శాతం తగ్గింది.


