బాలీవుడ్‌ పాటకు నేవీ సిబ్బంది వార్మప్‌! | Bollywood Song Played Part Warm Up Exercise For Navy Personnel | Sakshi
Sakshi News home page

Viral Video: సంగీత వ్యాయామంతో అలరించిన నేవీ సిబ్బంది!!

Jan 23 2022 4:37 PM | Updated on Jan 23 2022 7:30 PM

Bollywood Song Played Part Warm Up Exercise For Navy Personnel - Sakshi

భారత్‌ నేవీ సిబ్బంది రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్‌కి సంబంధించిన వార్మ్‌ అప్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లో భాగంగా బాలీవుడ్‌ పాటకు లయబద్దంగా నృత్యం చేసి అందరీ దృష్టిని ఆకర్షించారు.

Republic Day Parade Rehearsal Warm-Up: ఇంతవరకు ఆర్మీ సిబ్బంది పరేడ్‌లో భాగంగా బాలీవుడ్‌లోని పలు ప్రముఖ దేశ భక్తిపాటలకు డ్యాన్స్‌లు చేసిన వైరల్‌ వీడియోలు చూశాం. అంతెందుకు భారత సరిహద్దుల్లో గడ్డకట్టే చలిలో కాపలాకాస్తున్న జవాన్లు సైతం కొన్ని ప్రముఖ బాలీవుడ్‌ పాటలకు నృత్యం చేసి అందరీ మన్నలను పొందారు . అచ్చం అలానే నేవీ సిబ్బంది బాలీవుడ్‌ పాటకు అనుగుణంగా కదులుతూ తమ రోజువారి వ్యాయమాన్ని చేసి అందరీ దృష్టిని ఆకర్షించారు.

అసలు విషయంలోకెళ్తే....భారత నేవీ సిబ్బంది వార్మప్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లో భాగంగా బాలీవుడ్‌ పాట "దునియా మే లోగాన్ కో" పాటకు లయబద్దంగా డ్యాన్స్‌లు చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని విజయ్ చౌక్‌లో భారత్‌ నావికాదళ సిబ్బంది రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్‌కి సంబంధించిన వార్మ్‌ అప్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లో భాగంగా బాలీవుడ్‌ పాటకు అనుగుణంగా డ్యాన్స్‌ చేశారు.

అంతేకాదు డిఫెన్స్ సిబ్బంది నేవీ యూనిఫాం ధరించి, రైఫిల్స్ పట్టుకుని, అప్నా దేశ్ సినిమా నుంచి ఆర్‌డీ బర్మన్, ఆశా భోంస్లే పాడిన దునియా మే లోగోన్ కో లయకు అనుగుణంగా నృత్యం చేశారు. అయితే ఇది రిపబ్లిక్ డే వేడుకల్లో భాగం కాదని నేవీ అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మై గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: రోడ్లపై నెమళ్ల షికారు: మిస్మరైజింగ్‌ వైరల్‌ వీడియో!!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement