నకిలీ టీకా క్యాంపులపై సీబీఐ దర్యాప్తు!

BJP Claims TMC Links Fake Vaccination Camps Wants To CBI Probe - Sakshi

బెంగాల్‌ బీజేపీ డిమాండ్‌ 

కోల్‌కతా: నగరంలో నకిలీ కోవిడ్‌ టీకా క్యాంపుల వివాదం అధికార టీఎంసీ, బీజేపీ మధ్య వివాదం సృష్టిస్తోంది. ఈ నకిలీ క్యాంపుల వెనక టీఎంసీ లీడర్ల హస్తం ఉందని ఆరోపించిన బీజేపీ, ఈ విషయమై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు ఈ వివాదంపై దర్యాప్తునకు కోల్‌కతా పోలీసులు జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఒక సిట్‌ను ఏర్పాటు చేశారు. దేవాంగన్‌ దేవ్‌ అనే వ్యక్తి ఐఏఎస్‌ అధికారినని చెప్తూ పలు టీకా క్యాంపులు ఏర్పాటు చేసి దాదాపు 2వేల మందికి నకిలీ డోసులిచ్చాడు. గతంలో దేవాంగన్‌ పలువురు టీఎంసీ నేతలు, మంత్రులతో ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జాయింట్‌ కమిషనర్‌గా దేవ్‌ చెప్పుకున్నాడు.

ఆయన సోషల్‌ మీడియా అకౌంట్లలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఫొటోలున్నాయి. బీజేపీ ఆరోపణలను టీఎంసీ నేతలు తోసిపుచ్చారు. రాజకీయ నేతలను కలిసేందుకు పలువురు వస్తారని, వారందరితో తమకు ఎలా సంబంధం ఉంటుందని టీఎంసీ నేత ఫిర్హాద్‌ హకీం ప్రశ్నించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రమే ఈ నకిలీ టీకాల పంపిణీ జరిపిందని బురద చల్లేందుకు టీఎంసీ యత్నిస్తోందని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. ఇందులో పెద్ద కుట్ర ఉందని, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.  దేవాంగన్‌ చేసిన పని పిచ్చివాళ్లు చేసేదని పోలీసు కమిషనర్‌ సౌమెన్‌ మిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం దేవాంగన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దేవ్‌ ఆఫీసులో జరిపిన సోదాల్లో పలు యాంటీ బయాటిక్‌ ఇంజెక్షన్‌ డోసులు, నకిలీ లోగోలు లభించాయి.  ఈ మొత్తం అంశంపై స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు జరపాలని కలకత్తా హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

చదవండి: 27న అఖిల పక్ష సమావేశం   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

26-06-2021
Jun 26, 2021, 08:05 IST
సరిహద్దు జిల్లాల గ్రామాల్లో సాక్షి పరిశీలన
26-06-2021
Jun 26, 2021, 07:30 IST
లండన్‌: కరోనా భయంతో బ్రిటన్‌లో నివసిస్తున్న సుధా శివనాధం తన ఐదేళ్ల కూతురిని చంపుకుంది. తనకు కోవిడ్‌ కారణంగా మరణం...
26-06-2021
Jun 26, 2021, 04:30 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ గల 48 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 45...
26-06-2021
Jun 26, 2021, 04:24 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, వైరస్‌ ఇన్ఫెక్షన్‌కు సంబంధించి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)...
26-06-2021
Jun 26, 2021, 02:13 IST
►డెల్టా ప్లస్‌కు వ్యాపించే సామర్థ్యం ఎక్కువగా ఉన్నా.. అందుకు మనం ఆస్కారం ఇస్తున్నామా అన్నది ముఖ్యం. లాక్‌డౌన్‌ సడలించారన్న ఉద్దేశంతో జనం...
26-06-2021
Jun 26, 2021, 01:53 IST
సిడ్నీ: భారత్‌లో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చిన కోవిడ్‌–19 డెల్టా వేరియెంట్‌ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనాను జయించామని...
26-06-2021
Jun 26, 2021, 00:41 IST
ముంబై: మహారాష్ట్రలో కోవిడ్‌ –19 మహమ్మారి మూడో వేవ్‌లో ఐదు లక్షల మంది పిల్లలతో సహా 50 లక్షల మందికి...
25-06-2021
Jun 25, 2021, 19:09 IST
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 48 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదైనట్లు కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ డెల్టా...
25-06-2021
Jun 25, 2021, 14:05 IST
భోపాల్‌: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి రోజురోజుకి తన రూపాన్ని మార్చుకుంటూ వ్యాప్తి చేందుతుంది. అయితే, ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో...
25-06-2021
Jun 25, 2021, 11:30 IST
సురీ: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భమ్‌ జిల్లాలో గురువారం దాదాపు 150 మంది బీజేపీ కార్యకర్తలు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ)లో...
25-06-2021
Jun 25, 2021, 11:00 IST
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు కోవిడ్‌–19 టీకా కేటాయింపులో వివక్ష కొనసాగుతోందంటూ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. జనాభా, కేసుల తీవ్రత,...
25-06-2021
Jun 25, 2021, 08:59 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితుల మానసిక ఆరోగ్యంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు సంబంధించి ఇప్పటికే...
25-06-2021
Jun 25, 2021, 08:41 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం విజయవంతమయ్యేలా కాంగ్రెస్‌ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించాలని, అందుకు తమ పార్టీ...
25-06-2021
Jun 25, 2021, 08:39 IST
కోవిడ్‌ మహమ్మారి జ్ఞాపకశక్తి పైనా పంజా విసురుతోంది. దాదాపు ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి మనుషుల జీవన విధానాన్ని ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో...
25-06-2021
Jun 25, 2021, 07:57 IST
సాక్షి, హైదరాబాద్‌: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి కరోనా కాటుకు బలి అయితే, ఆ కుటుంబ సభ్యులు వీధిన పడకుండా...
25-06-2021
Jun 25, 2021, 03:53 IST
తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మిమి చక్రవర్తిని కూడా కేటుగాళ్లు మాయ చేశారు.
25-06-2021
Jun 25, 2021, 03:15 IST
ఐరాస: ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తున్న కరోనా డెల్టా వేరియంట్‌ను 85 దేశాల్లో గుర్తించారని గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)...
25-06-2021
Jun 25, 2021, 01:51 IST
►మన దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయి. మహా రాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఈ...
24-06-2021
Jun 24, 2021, 13:16 IST
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురైంది. కోవాగ్జిన్‌కు పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డీసీజీఐ అంగీకరించలేదు. మరింత క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా...
24-06-2021
Jun 24, 2021, 10:20 IST
భోపాల్‌: కరోనా మహమ్మారి రోజురోజుకు రూపం మార్చుకుంటూ మరింత శక్తివంతంగా తయారవతుంది. తాజాగా డెల్టా వేరియంట్‌ వ్యాప్తి ప్రారంభమయ్యింది. ఇది...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top