కోయంబత్తూరులో రూ.1000 కోట్లు.. బీజేపీ చీఫ్‌ సంచలన ఆరోపణలు | Coimbatore Lok Sabha Elections 2024: BJP Annamalai Alleges DMK AIADMK Spent 1000 Crores In Coimbatore - Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: కోయంబత్తూరులో రూ.1000 కోట్లు.. బీజేపీ చీఫ్‌ సంచలన ఆరోపణలు

Apr 19 2024 9:32 AM | Updated on Apr 19 2024 9:56 AM

BJP Annamalai alleges DMK AIADMK spent 1000 crores in Coimbatore - Sakshi

చెన్నై, సాక్షి: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు అభ్యర్థి కె.అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. కోయంబత్తూరులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డీఎంకే, ఏఐఏడీఎంకేలు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేశాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో పోలింగ్‌లో భాగంగా అన్నామలై కరూర్‌లోని ఉత్తుపట్టిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు.

తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. కోయంబత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై డీఎంకే నుంచి గణపతి పి.రాజ్‌కుమార్, ఏఐఏడీఎంకేకు చెందిన సింగై రామచంద్రన్ పోటీ చేస్తున్నారు. కోయంబత్తూరులో బీజేపీ వ్యక్తి తమను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఒక్కరినైనా తీసుకురాగలిగితే  తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని అన్నామలై సవాలు విసిరారు.

బీజేపీ సొంతంగా 25 శాతం దాటుతుందని, సీట్ల సంఖ్య కూడా రెండంకెల్లో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "ఈ రోజు నేను నా ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించాను. దేశంలోని ప్రతి పౌరునికి ఇది ఒక ముఖ్యమైన కర్తవ్యం. ఎందుకంటే భారతదేశంలో పనిచేసే ప్రజాస్వామ్యం ఉంది. ఇక్కడ పౌరులు ప్రజాస్వామ్యాన్ని పని చేసేలా చేస్తారు. మంచి వ్యక్తులు, పాలనపై ప్రజలు తమ విశ్వాసాన్ని మరోసారి చూపిస్తారని మాకు నమ్మకం ఉంది. తమిళనాడు ప్రజలు చరిత్రాత్మకమైన మార్పునకు నాంది పలుకుతారు” అని అన్నామలై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement