బీహెచ్‌ఈఎల్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

BHEL Recruitment 2021: Young Professional Vacancies, Eligibility, Salary Details Here - Sakshi

భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌).. యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 10

విభాగాలు: హైడ్రోజన్‌ ఎకనామిక్స్, ఆడిటివ్‌ మాన్యుఫ్యాక్చరింగ్, అప్‌స్ట్రీమ్‌ సోలార్‌ వాల్యూ చైన్, ఎనర్జీ స్టోరేజ్, కోల్‌ టూ మిథనాల్, కార్బన్‌ క్యాప్చర్‌.

అర్హత: మేనేజ్‌మెంట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పని అనుభవం ఉండాలి.  (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

వయసు: 01.11.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.80,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: సెలక్షన్‌ బోర్డ్‌ ద్వారా అభ్యర్థుల్ని స్క్రీనింగ్‌ చేస్తారు. స్క్రీనింగ్‌ ద్వారా షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల్ని ఇంటరాక్షన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021

► వెబ్‌సైట్‌: www.bhel.com

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top