బీజేపీ పతనం మొదలైంది | Bengal CM Mamata Banerjee comments on Narendra Modi | Sakshi
Sakshi News home page

బీజేపీ పతనం మొదలైంది

Apr 19 2026 5:39 AM | Updated on Apr 19 2026 5:39 AM

Bengal CM Mamata Banerjee comments on Narendra Modi

మోదీ ప్రభుత్వం మైనారిటీలో పడింది 

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు

హౌరా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ లక్ష్యంగా టీఎంసీ చీఫ్, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకోవడంలో విఫలమైన కాషాయ పార్టీ పతనం మొదలైందన్నారు. పార్లమెంట్‌లో సొంత మెజారిటీ లేని బీజేపీ ఎన్డీయేలోని రెండు పారీ్టల మద్దతుతో మాత్రమే మనుగడ సాగిస్తున్న విషయం శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలతో మరోసారి రుజువైందని విమర్శించారు. సీఎం మమత శనివారం హౌరా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. 

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను మహిళా రిజర్వేషన్‌ అంశంతో ముడిపెట్టడమెందుకంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు. అసలు కుట్రను బయటపడకుండా దాచేందుకే ఇలాంటి ప్రయత్నం చేసిందంటూ మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘మోదీజీ, శుక్రవారం నుంచి మీ పతనం ప్రారంభమైంది. లోక్‌సభలో మీరు ఓడిపోయారు. క్షేత్రస్థాయిలోనూ మీకు ఓటమి తప్పదు. బెంగాల్‌ ప్రజలు మిమ్మల్ని ఇంటిదారి పట్టిస్తారు’అంటూ హెచ్చరించారు. బీజేపీ కంటే ఎంతో ముందుగానే 1998లోనే మహిళా రిజర్వేషన్‌ డిమాండ్‌ను తాను తెరపైకి తెచ్చానన్నారు. 

బీజేపీ మాత్రం ఇప్పుడు తామే మహిళా రిజర్వేషన్లకు కారణమనే వాదనను ప్రచారం చేసుకుంటోందంటూ మమత ఆరోపించారు. బీజేపీ ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలను బలహీనపర్చడానికేనంటూ ఆరోపించారు. ‘దేశాన్ని ముక్కలు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నింది. బెంగాల్‌తోపాటు అన్ని రాష్ట్రాలను విడదీస్తుంది. అందుకే లోక్‌సభ సీట్లను పెంచేందుకు బీజేపీ ముందుకు వచి్చంది. ఇది చాలా కీలక అంశం అయినందునే మా పార్టీ ఎంపీలంతా శుక్రవారం పార్లమెంట్‌కు హాజరయ్యారు. బిల్లును ఓడించారు. బెంగాల్‌ను విభజించేందుకు మేం ఒప్పుకోం’అని మమత స్పష్టం చేశారు. 

మహిళా సాధికారతపై బీజేపీ తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తమ పార్టీ పార్లమెంట్‌ సభ్యుల్లో 46 శాతం మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు సగం సీట్లను కేటాయించామని చెప్పారు. బిహార్‌ తాజామాజీ సీఎం, రాజ్యసభ ఎంపీ నితీశ్‌ కుమార్‌ అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఎన్నికల్లో నితీశ్‌ను వాడుకున్న బీజేపీ, అనంతరం ఆయన్ను పక్కనబెట్టిందని ఆరోపించారు. నెలకు రూ.3 వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటూ ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలు పంచుతున్న దరఖాస్తులను నింపవద్దని సీఎం మమత రాష్ట్ర మహిళలను కోరారు.   

Advertisement
 
Advertisement
Advertisement