భయపెడుతున్న భల్లూకాలు

Bears Group Ruscus At Nabarangpur Nandahandi Road - Sakshi

భువనేశ్వర్‌ : నవరంగపూర్‌ జిల్లాలో ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నవరంగపూర్‌–నందాహండి మార్గంలో నాలుగు ఎలుగుబంట్లను ఆ ప్రాంత ప్రజలు చూశారు. అవి రహదారిపై తిరుగుతూ ఉండడంతో ఆ మార్గంలో   వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎలుగుబంట్లు తమపై ఎక్కడ దాడికి పాల్పడతాయోనన్న భయంతో పలువురు పరుగులు తీసినట్లు సమాచారం.  గత ఏడాది ఇదే సమయంలో ఈ మార్గంలోని సిందిగుడ  ప్రాంతంలో ఒక వృద్ధునిపై ఎలుగుబంటి దాడిచేసి చంపిన ఉదంతాన్ని నేటికీ ప్రజలు మరువలేదు. ఇప్పుడు ఒకేసారి నాలుగు ఎలుగుబంట్లు రావడంతో   భయాందోళన చెందిన ప్రజలు వెంటనే అటవీ విభాగ అధికారులు ఎలుగుబంట్లను అడవిలోకి తరలించాలని కోరుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top