స్వతంత్ర భారతి: మోహన్‌దాస్‌-ఘనశ్యాం దాస్‌

Azadi Ka Amrit Mahotsav Padma Vibhushan GD Birla Fan Of Mahatma Gandhi - Sakshi

జీ.డి. బిర్లాగా ప్రఖ్యాతులు.. ఘనశ్యామ్‌ దాస్‌ బిర్లా. భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని. 50 లక్షల పెట్టుబడి దాటిన తరువాత తన సోదరులతో కలిసి 1919లో గ్వాలియర్‌ పట్టణంలో సొంతంగా బట్టల మిల్లు స్థాపించారు. తరువాత  రాజకీయాలలోనూ రాణించారు. 1926లో బ్రిటిష్‌ వారి హయాంలో శాసనసభకు వెళ్లారు. అనంతరం కార్ల వ్యాపారంలో ప్రవేశించి 1940లో హిందూస్తాన్‌ మోటార్స్‌ అనే సంస్థను స్థాపించారు.

అటు తరువాత సిమెంట్, ఇనుము, కెమికల్స్, ప్లాస్టిక్‌ పరిశ్రమలలో రాణించారు. 1943 ప్రాంతంలో కలకత్తాలో యునైటెడ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ను (యూకో) స్థాపించారు. 1983 జూన్‌ 11 న తన 90 వ ఏట మరణించారు. 1957లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్‌తో గౌరవించింది. దాస్‌ తన జీవితాంతం గాంధీ మార్గాన్నే అనుసరించారు. గాంధీజీకి ఆయన అనుచరుడిగా కూడా ఉన్నారు. గాంధీజీ చనిపోవడానికి ముందు నాలుగు నెలలు ఢిల్లీలోని బిర్లా హౌస్‌లోనే ఉన్నారు! 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top