అయోధ్య: 5.51 లక్షల దీపాలతో ఉత్సవం!

Ayodhya Deepotsav Over 5 Lakh Lamps To Be Lit Preparations Underway - Sakshi

లక్నో: అయోధ్యలో దీపోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్‌ 11 నుంచి 13 మధ్య జరిగే ఈ దీపాల పండుగలో ఈసారి 5.51 లక్షల దీపాలను వెలిగించనున్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రామజన్మభూమి- అయోధ్య వివాదం కేసులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు తర్వాత జరుపుకొంటున్న తొలి దీపావళి కావడంతో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే విధంగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ(ఆగష్టు 5) తర్వాత జరగనున్న అయోధ్యలో మొదటి వేడుక కానుండడంతో ప్రత్యేకత సంతరించుకుంది. (చదవండి: ఉద్యోగులకు దీపావళి కానుక : ఒక నెల బోనస్‌)

ఈ నేపథ్యంలో ఈసారి మరింత ప్రత్యేకంగా దీపోత్సవాన్ని నిర్వహించేందుకు యోగి సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఎం ఆదేశాలతో శ్రీరామ జన్మభూమితో పాటు కనక భవన్‌, రామ్‌ పైడి, హనుమాన్‌ ఘర్‌ ఆలయాలను అంగరంగ వైభవంగా అలంకరించేందుకు నిర్వహకులు సిద్ధమవుతున్నారు. ఇక ఈ శుభ సందర్భంలో, మొట్ట మొదటి సారిగా ఆవుపేడతో చేసిన దీపాలను ఈ వేడుకలో వాడుతున్నారు. యూపీ ప్రభుత్వం ఈ ఉత్సవాలకు 20 జానపద నృత్య బృందాలను ఆహ్వానించింది. ఇక సీఎం యోగికి అయోధ్యతో మంచి అనుబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top