
రేడియల్ యాంటెన్నా
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 7న పీఎస్‌ఎల్‌వీ సీ–49 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–01) ఉపగ్రహానికి మంగళవారం సాయంత్రం రేడియల్ రిబ్ యాంటెన్నా విజయవంతంగా విచ్చుకున్నట్టు ఇస్రో తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. వ్యవసాయం, అటవీ, విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యాంటెన్నా ఉపగ్రహ సమాచారాన్ని అందించేందుకు కీలక భూమిక పోషిస్తుంది. ఉపగ్రహ సేవలు బుధవారం నుంచే అందుబాటులోకి వస్తాయని ఇస్రో ప్రకటించింది.