ఈడీకి కౌంటర్‌ ఇచ్చిన అఖిలేష్‌ యాదవ్‌.. రెస్పాన్స్‌ ఎలా ఉండనుంది?

Akhilesh Yadav Counter Attack To ED On Bundelkhand Expressway - Sakshi

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హయంలో ఈడీ దాడులు ఎక్కువయ్యాయి. ఈ దాడుల విషయంలో కూడా సుప్రీంకోర్టు వారికి మద్దతుగానే వ్యాఖ్యలు చేసింది. కానీ, ఈడీ దాడులపై ప్రతిపక్ష నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌.. ఈడీని కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష నేతలను వేధించడానికే వాడుకుంటున్నదని విమర్శించారు. ఈడీ స్వతహాగా దాడులు చేస్తే.. బీజేపీ నేతలకు సంబంధించిన అవినీతిపై ఎందుకు దర్యాప్తు చేయడంలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఈడీ ఎందుకు బయటకు తీయడంలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.

బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు. యోగి సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన నాలుగు రోజులకే వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. కాగా, ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ జూలై 16వ తేదీన ప్రారంభించారు. అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో ఈడీ ఎందుకు విచారణ చేపట్టలేదని అఖిలేష్‌ ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ నేత హత్య.. కేరళ నుంచి కుట్ర జరిగిందా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top