ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ | 50 Naxalites Surrender In Chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

Mar 30 2025 4:55 PM | Updated on Mar 30 2025 4:59 PM

50 Naxalites Surrender In Chhattisgarh

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌ ఎస్పీ ఎదుట 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. వారిలో ఆరుగురిపై రూ.8లక్షల, 13మందిపై రూ.68లక్షల రివార్డ్‌ ఉంది.

మావోయిస్టు సిద్ధాంతాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకువడం, వారి సీనియర్‌ కేడర్‌ స్థానిక గిరిజనుల్ని దోచుకోవడం, అంతర్గత విభేదాల కారణంగా లొంగిపోయినట్లు బీజాపూర్‌ సీనియర్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వారికి పునరావసం కల్పిస్తామని చెప్పారు.

అయితే, మార్చి 31, 2026లోపు నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ఆ దిశగా మావోయిస్టులను ఏరిపారేస్తుంది. శనివారం శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా దళాలు రెండు ప్రాంతాల్లో జరిపిన ఎదురుకాల్పుల్లో 18 మావోయిస్టులను మట్టుబెట్టాయి. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఆ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన కొన్ని గంటల వ్యవధిలో మావోయిస్టులు లొంగిపోయారు.

కాగా,ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 134 మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. వీరిలో 118 మంది బస్తర్ డివిజన్‌లోనే మృతి చెందారు.2024లో, బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో కలిపి మొత్తం 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement