తుపాకీతో కాల్చుకుని టీచర్‌ ఆత్మహత్య | 22 Years Old Teacher Ends Her Life In Chikmagalur, Check More Details About This Incident | Sakshi
Sakshi News home page

తుపాకీతో కాల్చుకుని టీచర్‌ ఆత్మహత్య

Apr 27 2026 8:55 AM | Updated on Apr 27 2026 10:11 AM

A 22 year old Girl Ends Her Life In Chikmagalur

బెంగళూరు: కొడగు జిల్లా మడికెరి తాలూకా చేరంబాణె గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఒకరు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామవాసి రోహిణి (51) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆదివారం ఇంట్లో ఉన్న బ్యారెల్‌ తుపాకీతో కాల్చుకోవడంతో అక్కడే మరణించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియటంలేదు. మడికెరి గ్రామాంతర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

సాంబారు చేయలేదని...  
తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా మూడగెరె తాలూకా దేవవృంద గ్రామంలో జరిగింది. సౌజన్య పూజారి (22) మృతురాలు. శనివారం ఉదయం తండ్రి కాయగూరలు తెచ్చి మధ్యాహ్నం భోజనానికి సాంబారు వండాలని చెప్పి వెళ్లాడు. కానీ ఆమె చేయలేదు, భోజనవేళకు వచ్చిన తండ్రి.. ఎందుకు చేయలేదని దండించి, హోటల్‌ నుంచి సాంబారు తెచ్చుకుందామని బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి సౌజన్య ఉరికి వేలాడుతూ ఉంది. గోణిబీడు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement