పకడ్బందీగా నిర్వహిస్తాం..
మండలాల వారీగా ఓటర్ల వివరాలు
నేటినుంచి ఓటరు జాబితా ఇంటింటి సమగ్ర సవరణ
● ఇప్పటికే బూత్ లెవల్ అధికారులకు శిక్షణ పూర్తి
● జూలై 24 వరకు ప్రక్రియ
ముగించేలా కసరత్తు
● 31న ముసాయిదా,
అక్టోబర్ 1న తుది జాబితా ప్రచురణ
–8లో u
నారాయణపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమానికి జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో ఈ ప్రక్రియ గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టింది. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్‌ఓలు), అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు(ఏఈఆర్‌ఓ), బూత్‌లెవల్ అధికారులు (బీఎల్‌ఓ)లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి సన్నాహక సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేసింది. బుధవారం మండలాల వారీగా చివరగా బీఎల్‌ఓలకు శిక్షణ ఇచ్చి గురువారం నుంచి ఇంటింటికి వెళ్లేలా సన్నద్ధం చేశారు. బీఎల్‌ఓలు ఇంటింటికి తిరిగి 2002, 2025 ఓటర్ల జాబితాను పోల్చి చనిపోయిన, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి స్థానికంగా నివసిస్తున్న అర్హుల పేర్లను యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.
● నారాయణపేట నియోజకవర్గానికి ఆర్డీఓ రమేష్, మక్తల్ నియోజకవర్గానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఈఆర్వోలుగా, 13 మండలాలకు తహసీల్దార్లు ఏఈఆర్‌ఓలుగా పర్యవేక్షించనున్నారు. 554 పోలింగ్ కేంద్రాలకు 554 మంది బీఎల్వోలను నియమించారు. మూడు విడతల్లో గృహ సందర్శనలు నిర్వహించి కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారు, వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువచోట్ల పేర్లు ఉన్న వారి వివరాలను సేకరిస్తారు.
జిల్లాలో ఇప్పటికే మ్యాపింగ్ ప్రక్రియ 86.88 శాతం పూర్తయింది. మొత్తం 4,95,574 మంది ఓటర్లలో 4,24,175 మంది వివరాలు మ్యాపింగ్ కాగా.. 71,399 మంది ఓటర్ల వివరాలు మరోసారి ధ్రువీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి ప్రత్యక్షంగా వివరాలు సేకరించనున్నారు.
2002 ప్రకారం ఓటర్ల వివరాలు
నియోజకవర్గం పోలింగ్‌కేంద్రాలు మహిళలు పురుషులు ఇతరులు
మక్తల్ 196 97,698 93,148 1
నారాయణపేట 187 95,980 89,084 1
జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేశాం. ప్రతి దశను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ.. ఎలాంటి లోపాలు, ఫిర్యాదులకు తావు లేకుండా అవసరమైన చర్యలు చేపడతాం.అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్ల తొలగింపులో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తాం.
– సీహెచ్ ప్రియాంక, కలెక్టర్
మండలం పోలింగ్ కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు
నారాయణపేట నియోజకవర్గం
కోయిల్‌కొండ 61 27,322 28,270 2
దామరగిద్ద 53 22,359 23,335 –
నారాయణపేట 90 41,501 43,502 1
ధన్వాడ 39 15,266 15,597 1
మరికల్ 27 12,083 12,534 –
మక్తల్ నియోజకవర్గం
ఊట్కూర్ 51 22,934 23,834 –
మాగనూర్ 25 9,877 10,331 –
కృష్ణా 29 10,889 11,550 –
మక్తల్ 74 33,683 35,107 1
అమరచింత 26 11.247 11,833 –
ఆత్మకూర్ 35 15,557 15,942 1
నర్వ 31 14,099 14,988 –
మదనాపురం 4 981 1,041 –
మరికల్ 9 4,301 4,605 –


