విద్యావ్యవస్థను విధ్వంసం చేస్తున్న కేంద్రం | - | Sakshi
Sakshi News home page

విద్యావ్యవస్థను విధ్వంసం చేస్తున్న కేంద్రం

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

నారాయణపేట: దేశంలో ప్రస్తుతం అమలవుతున్న విద్యావ్యవస్థ విద్యార్థుల ప్రతిభను వెలికితీసే వ్యవస్థగా కాకుండా.. వారిని తిరస్కరించే ‘రిజెక్షన్‌ సిస్టమ్‌’గా మారిందని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సీవీఆర్‌ భవన్‌న్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం విద్యార్థులను పరీక్షల యంత్రాలుగా మార్చుతుంటే.. కాంగ్రెస్‌పార్టీ విద్యార్థుల కలలను సాకారం చేసే విద్యావ్యవస్థ కోసం పోరాడుతోందని తెలిపారు. వైద్య విద్య చదవాలనే లక్ష్యంతో లక్షలాది మంది విద్యార్థులు నీట్‌ రాస్తున్నప్పటికీ.. కొద్దిమందికే సీట్లు దక్కుతున్నాయని పేర్కొన్నారు. ఇది విద్యార్థుల సామర్థ్యాన్ని కొలిచే వ్యవస్థ కాకుండా అవకాశాలను పరిమితం చేసే వ్యవస్థగా మారిందన్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటన దేశ విద్యావ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించలేదన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్‌టీఏపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగంలో చారిత్రాక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. కులం, మతం, ఆర్థిక అసమానతలకు అతీతంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆధునిక సైనన్స్‌ ల్యాబ్స్‌, డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌, లైబ్రరీలు, క్రీడా వసతులతో ప్రభుత్వ విద్యను కార్పొరేట్‌ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. పేద, మధ్యతరగతి పిల్లలు కూడా అత్యుత్తమ విద్యను పొందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు. విద్యార్థుల అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు తెలుసుకునేందుకు త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వాటిని రాష్ట్ర, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. విద్యార్థులు నిరాశకు గురికాకుండా ధైర్యంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎండీ సలీం, జిల్లా అధికార ప్రతినిధులు వకీల్‌ సంతోష్‌కుమార్‌, జనార్దన్‌రెడ్డి, మండల, పట్ట ణ అధ్యక్షులు కోట్ల రవీందర్‌రెడ్డి, వెంకటే ష్‌గౌడ్‌, మైనార్టీసెల్‌ జిల్లా అధ్యక్షుడు మహిమూద్‌ ఖురేషి, సీనియర్‌ నాయకులు ఎండీ గౌస్‌, సుధాకర్‌, సరాఫ్‌ నాగరాజు, అమీరుద్దీన్‌, మనోజ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement