ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో పరిసరాలను ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నాం. పెద్దనాలాతోనే అసలు సమస్య తలెత్తుతోంది. దీనిని శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందిది. వారంలో రెండుసార్లు వచ్చి ఒకచోట చెత్తాచెదారంతోపాటు పెద్ద కాల్వలోని ప్లాస్టిక్ వ్యర్థాలను పోగుచేసి వెళ్లిపోతున్నారు. దీంతో తిరిగి అందులోనే గాలికి కొట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు డంపింగ్‌కు తరలించాలని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు.
– అశోక్‌కుమార్, డీఎం, మహబూబ్‌నగర్
అపరిశుభ్ర వాతావరణమే..
నేను ఓ ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తాను. నిత్యం ఆర్టీసీ బస్సులలోనే రాకపోకలు సాగిస్తుంటాను. కొత్త బస్టాండులోకి వెళ్లగానే అంతా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది. ప్లాట్‌ఫాం వరకు దుర్గంధం మధ్య అలాగే వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం ఉండటంతో ఇబ్బందిగా ఉంటుంది. బస్సు వచ్చే వరకు అక్కడ ఉన్నంత సేపు దుర్వాసన భరించాల్సిందే. ఆర్టీసీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.
– నాగరాజు, పాతపాలమూరు,
మహబూబ్‌నగర్
●


