‘పల్లె’ చక్రం కదలలే.. | - | Sakshi
Sakshi News home page

‘పల్లె’ చక్రం కదలలే..

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

కర్ణాటక వాహనాల అడ్డగింపు

పురుషులకూ ఉచితమే..

ప్రైవేటు అద్దె బస్సులతో..

రీజియన్‌లో 134 నడిచిన బస్సులు

నారాయణపేట

గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

నారాయణపేట రూరల్‌: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో బుధవారం ప్రజా రవాణా స్తంభించింది. జిల్లాలో నారాయణపేట, కోస్గి డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు రోడ్డుపైకి రాకుండా తెల్లవారుజామున నుంచే కార్మికులు డిపో గేటు ఎదుట బైఠాయించారు. యాజమాన్యా నికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. వెంటనే యూ నియన్లను పునరుద్ధరించి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీ అమ లు చేయాలని కోరారు. సమ్మెకు బీజేపీతో పాటు పీవైఎల్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్ద తు ప్రకటించింది. మొదట ఆర్టీసీ అధికారులు స్థాని క పోలీసుల సహకారంతో బస్సులు నడిపే ప్రయ త్నం చేయగా అది విఫలమైంది. ఉదయం ఐదు బస్సులను హైదరాబాద్‌ రూట్‌లో నడపగా.. మహబూబ్‌నగర్‌లో ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు.

డిపార్ట్‌మెంట్‌ బస్సులు నడిపేందుకు డ్రైవర్లు లేకపోవడంతో ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడుస్తున్న ప్రైవేట్‌ బస్సులను నడిపే ప్రయత్నం ఆర్టీసీ చేసింది. అద్దె బస్సుల డ్రైవర్లు సైతం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా విధులకు హాజరు కాలేదు. కొంతమంది బస్సుల యజమానులు బలవంతంగా డ్రైవర్లను విధులకు హాజరు కావాలని ఒత్తిడి తేవడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు కలగజేసుకొని వారిని సముదాయించి బయటికి పంపారు. ఇష్టపూర్వకంగా ఎవరైనా బస్సులను నడిపితే వారిని అడ్డుకోద్దని పోలీసులు హెచ్చరించారు.

సమ్మె తొలిరోజు కార్మికులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బస్సులను నడిపించాలని ఉద్దేశంతో అధికారులు చేసిన ప్రయత్నం మధ్యాహ్నం వరకు ఫలించలేదు. హైదరాబాద్‌, కోస్గి, మక్తల్‌ మూడు రూట్లలో సాయంత్రం వరకు 13 బస్సులు నడిపించారు. అయితే సమ్మె ప్రభావం లేదని చూపించేందుకు సాయంత్రం వేళలో పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను కాంట్రాక్ట్‌ డ్రైవర్లతో నడిపించారు. 6.30 తర్వాత వరుసగా ఒకే మార్గంలో బస్సులను పంపించడం విమర్శలకు తావిచ్చింది. ప్రయాణికులు లేకుండానే ఖాళీ బస్సులను తిప్పడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నించారు. అయితే మొదటగా మహిళలు మాత్రమే ఎక్కించుకోవాలని సంబంధిత డ్రైవర్లకు సూచించగా, అది వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని గుర్తించి టికెట్లు లేకుండానే అందరిని గమ్యస్థానాలకు చేర్చాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే టికెట్లు ఇచ్చేందుకు కండక్టర్లు లేకపోవడం, టిమ్‌ మిషన్లు సైతం కాంట్రాక్ట్‌ డ్రైవర్లకు రాకపోవడంతో అందరికీ ఉచితంగా బస్సుల్లో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

సమ్మె కారణంగా డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులు గేటు ఎదుట బైఠాయించారు. అదే సమయంలో కర్ణాటక నుంచి వచ్చే బస్సులు బస్టాండ్‌లోకి రావడంతో వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కలుగజేసుకొని వారిని నివారించేందుకు ప్రయత్నించగా.. వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే కార్మికులను బస్టాండ్‌ నుంచి పోలీసులు బయటికి పంపించారు. శాంతియుతంగా చేస్తున్న సమ్మెకు పోలీసులు సహకరించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ సమ్మెతో మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు పది డిపోల పరిధిలో 925 బస్సులకు గాను కేవలం 134 బస్సులు మాత్రమే నడిచాయి. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేట్‌ హైర్‌, ఈవీ బస్సులు రోడ్డెక్కాయి. కోస్గి డిపోలో ఒక్క బస్సు రోడ్డెక్కలేదు. మహబూబ్‌నగర్‌ డిపో పరిధిలో అత్యధికంగా 40 బస్సులు నడిపించారు.

సమ్మె మొదటి రోజు నడిచిన బస్సులు

డిపో ఆర్టీసీ ప్రైవేట్‌ ఈవీ

హైర్‌

అచ్చంపేట 5 9

గద్వాల 10 15 0

కల్వకుర్తి 0 9 0

మహబూబ్‌నగర్‌ 0 24 16

నాగర్‌కర్నూల్‌ 3 6 0

నారాయణపేట 0 9 0

షాద్‌నగర్‌ 5 0 0

వనపర్తి 11 2 7

కొల్లాపూర్‌0 0 3 0

Advertisement
 
Advertisement
Advertisement