గూడు.. తీరొక్క గోడు! | - | Sakshi
Sakshi News home page

గూడు.. తీరొక్క గోడు!

Aug 1 2025 12:25 PM | Updated on Aug 2 2025 10:18 AM

గూడు.

గూడు.. తీరొక్క గోడు!

‘ఇందిరమ్మ ఇళ్ల’లో కొర్రీలు

పునాది కూల్చేస్తేనే

బిల్లు ఇస్తామన్నారు..

మొదటి విడతలో నా పేరు మీద ఇందిరమ్మ ఇలు్‌ల్‌ మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో నింబంధనల ప్రకారం రెండు వరుసల పునాది వేశాం. అధికారులు పరిశీలనకు రాగా.. మేం ముగ్గు వేసిన తర్వాతనే పనులు ప్రారంభించాలని.. పునాది కూల్చివేయాలని చెప్పారు. ఆ తర్వాతే ముగ్గు పోస్తామని.. మళ్లీ పునాది నిర్మించిన తర్వాత బిల్లు మంజూరవుతుందన్నారు. లేదంటే ఇల్లు రద్దు చేస్తామని చెప్పారు. చేసేదేమీ లేక పక్కనే చిన్న పూరి గుడిసె వేసుకుని అప్పులు చేసి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాం.

– లక్ష్మమ్మ,

పల్లెగడ్డ, మరికల్‌, నారాయణపేట

బిల్లు అడిగితే

స్పందించడం లేదు..

నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో అధికారులు 60 గజాలు కొలిచి ఇంటి నిర్మాణానికి ముగ్గు వేశారు. నాకు ఇద్దరు కుమారులు. దీంతో పక్కన మరింత ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణ పునాదిని విస్తరించాను. అధికారులు పరిశీలించి నిబంధనలు ఒప్పుకోవన్నారు. మేం ముగ్గు వేసిన వరకు నిర్మిస్తేనే బిల్లు మంజూరవుతుందని చెప్పారు. దీంతో వారు వేసిన ముగ్గు వరకే ఇల్లు నిర్మిస్తున్నా. గోడల పని పూర్తయింది. మొదటి బిల్లు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. స్పందించడం లేదు.

– గోపాల్‌, పల్లెగడ్డ, మరికల్‌, నారాయణపేట

అర్హుల జాబితాలో చేర్చి.. ఆపై తీసేయడంతో

ఆందోళన

అడ్డంకిగా మారిన పలు నిబంధనలు

600 ఎస్‌ఎఫ్‌టీలలోపే అనుమతితో

పలువురు దూరం

పక్కా ఇళ్లలో

అద్దెకున్న వారికి

వర్తించని పథకం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పేద, మధ్య తరగతి కుటుంబాలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనల కొర్రీలు లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ప్రధానంగా 600 చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తే ఇందిరమ్మ పథకం వర్తించదని అధికారులు తేల్చిచెబుతుండడంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా వేచి చూస్తున్నారు. మరో వైపు అర్హుల జాబితాలో చేర్చి, ఆపై తీసేయడం.. పక్కా ఇళ్లలో అద్దెకుంటున్న వారికీ మొండిచేయి చూపడంతో పలువురు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిబంధకాలుగా మారిన నిబంధనలతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇబ్బందిపడుతున్న లబ్ధిదారులు, ఆశావహుల తీరొక్క గోడుపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌..

జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు..

గూడు.. తీరొక్క గోడు! 1
1/4

గూడు.. తీరొక్క గోడు!

గూడు.. తీరొక్క గోడు! 2
2/4

గూడు.. తీరొక్క గోడు!

గూడు.. తీరొక్క గోడు! 3
3/4

గూడు.. తీరొక్క గోడు!

గూడు.. తీరొక్క గోడు! 4
4/4

గూడు.. తీరొక్క గోడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement