
బాలికలు క్రీడల్లోనూ రాణించాలి
నారాయణపేట రూరల్: బాలికలు బాలుర కంటే ముందుండి విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆకాంక్షించారు. జిల్లాకేంద్రంలో మహిళ, శిశు సంక్షేమశాఖ పరిధిలో కొనసాగుతున్న మహిళా సాధికారత కేంద్రంలో గురువారం అథ్లెటిక్స్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేసి మాట్లాడారు. బేటీ బచావో.. బేటీ పడావో పథకంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడలకు ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పించిందని.. వినూత్న కార్యక్రమాలతో బాలికా విద్యను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేష్, పీఈటీ సాయినాథ్, అక్తర్ పాషా, ఖేలో ఇండియా కోచ్ హారికదేవి, మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త నర్సింహులు, జెండర్ స్పెషలిస్ట్‌లు అనిత, నర్సింహ, క్రికెట్ కోచ్ అజయ్, అథ్లెటిక్స్, క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.