
ఎఫ్సీ లేని 30 స్కూల్ బస్సులు సీజ్
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి జిల్లాలో అన్ని రకాల పాఠశాలలు పునఃప్రారంభం అయిన క్రమంలో ఉమ్మడి జిల్లాలో 1,429 స్కూల్ బస్సులు ఉంటే ఇప్పటి వరకు 1,066 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోగా ఇంకా 363 బస్సులకు పరీక్షలు పూర్తి కాలేదు. దీంతో ఎంవీఐల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళలలో రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా ఉమ్మడి జిల్లాలో 30 స్కూల్ బస్సులు సీజ్ చేశారు. మహబూబ్నగర్లో బుధవారం ఉదయం, సాయంత్రం ఆర్టీఏ అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి స్కూల్ బస్సుకు సంబంధించి ఎఫ్సీ (ఫిట్నెస్ సర్టిఫికెట) కచ్చితంగా ఉండాలని, లేకుండా రోడ్లపై తిరిగితే సీజ్ చేస్తామని డీటీసీ కిషన్ హెచ్చరించారు.

ఎఫ్సీ లేని 30 స్కూల్ బస్సులు సీజ్