మాటలతో.. వేధింపులు! | - | Sakshi
Sakshi News home page

మాటలతో.. వేధింపులు!

Apr 5 2025 12:27 AM | Updated on Apr 5 2025 12:27 AM

మాటలతో.. వేధింపులు!

మాటలతో.. వేధింపులు!

నారాయణపేట: జిల్లా సెర్ప్‌ ఉద్యోగులను ఎవరిని కదిలించినా ‘‘అడిషనల్‌ డీఆర్డీఓ వ్యంగ్యంగా డబుల్‌ మీనింగ్‌ మాటలు మాట్లాడతాడు.. పని త్వరగా చెయ్‌.. పని చేయనింకా రాదా.. ఏం నేర్చుకున్నారంటూ.. సారూ సైకోలా వ్యవహరిస్తాడు.. సాధిస్తాడు అంతే..’’ అంటూ ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న ‘మహిళా ఉద్యోగుల హడల్‌’.. ‘అసలేం జరుగుతోంది..’ అనే వార్తా కథనాలతో డీఆర్డీఓ కార్యాలయంతో పాటు ఇతర శాఖల్లో సైతం చర్చానీయాంశంగా మారింది. ఈ కథనాలతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని డీఆర్డీఓ కార్యాలయాల్లో మహిళలపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఒక పట్టు పట్టాలనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

ఎమ్మెల్యే ఆరా..

ఎమ్మెల్యే పీఏ చిట్టెం మాధవరెడ్డికి సెర్ప్‌ ఉద్యోగులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అడిషనల్‌ డీఆర్డీఓ వ్యవహార తీరుపై స్థానిక ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. మహిళా ఉద్యోగినులు, సెర్ఫ్‌ ఉద్యోగులతో వ్యవహరించిన తీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. తగు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకు ఏర్పాటు, నిర్వాహణ, అందులో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది నియామకంపై ఇటు డీఆర్డీఓ ఉన్నతాఽధికారులు, అటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ఒక దశలో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

డీపీఎంకు లీవ్‌ లెటర్‌..

అధికారులకు ఎవరికై నా సెలవు కావాలంటే ఉన్నతాధికారులకు లీవ్‌ లెటర్‌ సమర్పించి అనుమతి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే అడిషనల్‌ డీఆర్డీఓపై వస్తున్న ఆరోపణలతో ఉన్నతాధికారులకు ముఖం చూయించలేకపోతున్నారు. గురువారం అడిషనల్‌ కలెక్టర్‌ను కలిసేందుకు ఆయన ప్రయత్నించగా.. అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఇక చేసేదిలేక వెనుదిరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఒక రోజు లీవ్‌ పెడుతున్నట్లు లెటర్‌ రాసి.. డీఆర్డీఓ కార్యాలయంలోని ఓ డీపీఎంకు ఇచ్చి వెళ్లిపోయారు. అయితే శుక్రవారం ఒక రోజు సెలవు తీసుకుంటే.. శనివారం బాబు జగ్జీవన్‌రాం జయంతి, ఆదివారం రెండు రోజులు ప్రభు త్వ సెలవులు ఉండటంతో సోమవారం చూసుకుందామంటూ వెళ్లిపోయినట్లు తెలిసింది. కాగా, డీపీఓ ఆ లీవ్‌ లెటర్‌ను డీఆర్డీఓకు అందజేసేందుకు వెళ్లగా.. ఆ లెటర్‌ మీకు ఇస్తే మీ వద్ద పెట్టుకోండి.. అంతా అతడి ఇష్టమేనా అంటూ అటెండెన్స్‌ రిజిస్ట్రర్‌లో అటు సీఎల్‌.. ఇటు అబ్సెంట్‌ వేయకుండా డాస్‌ (–) పెట్టినట్లు తెలిసింది.

సెర్ప్‌ ఉద్యోగులను ఎవరిని కదిలించినా ఇదే మాట..

అడిషనల్‌ కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తే నో అపాయిమెంట్‌

డీపీఎంకు లీవ్‌ లేటర్‌ ఇచ్చి వెళ్లిపోయిన అడిషనల్‌ డీఆర్డీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement