ప్రజాస్వామ్యం.. అపహాస్యం! | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం.. అపహాస్యం!

Nov 30 2026 1:28 AM | Updated on Nov 30 2026 1:28 AM

కొలిమిగుండ్ల: ప్రజలు ఓట్లు వేయకుండా టీడీపీ నాయకులు అడ్డకుని ప్రజస్వామ్యాన్ని ఓడిపోయేలా చేశారు. ఆదివారం కొలిమిగుండ్ల మండలంలో పెట్నికోట, కొలిమిగుండ్ల, తుమ్మలపెంట, కల్వటాల, తిమ్మనాయినపేట, యర్రగుడి, తోళ్లమడుగు పంచాయితీల్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం ఆరున్నర గంటల నుంచే ఓటర్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్‌ ప్రారంభానికి ముందే చుట్టు పక్కల గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు వాహనాల్లో కార్యకర్తలను వెంట వేసుకొని ముందుగానే వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఎవరు ఏ పంచాయతీకి వెళ్లాలని నిర్ణయించుకొని అక్కడికి పదుల సంఖ్యలో చేరుకున్నారు. ప్రశాంతంగా ఓటింగ్‌ జరుగుతుండటం, ఎక్కువ భాగం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకే ఓట్లు పడుతున్నాయని భావించి కుట్ర పన్నారు. పోలీసుల సమక్షంలోనే పోలింగ్‌ బూత్‌ల్లోకి వెళ్లి తలుపులు వేసి రిగ్గింగ్‌ పాల్పడ్డారు. వెఎస్సార్‌సీపీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. యర్రగుడి, తుమ్మలపెంట గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. కొలిమిగుండ్లలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోక ముందే టీడీపీ నాయకులు రిగ్గింగ్‌ చేసుకున్నారు. దీంతో చాలా మంది ఓటర్లు కేంద్రాలకు వెళ్ల లేక పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement