ప్రజలను నమ్మించి నట్టేట ముంచారు | - | Sakshi
Sakshi News home page

ప్రజలను నమ్మించి నట్టేట ముంచారు

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

డోన్‌: సీఎం చంద్రబాబు నాయుడు నమ్మించి వంచించడం తప్ప ప్రజలకు చేసిందేమి లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన స్వగృహంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు మల్లికార్జునరెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మెన్‌ జాకీర్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వార్డులకు చెందిన పార్టీ క్రీయాశీలక కార్యకర్తలతో బుగ్గన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రెండు నెలలు పార్టీకి అత్యంత కీలకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, ప్రజాస్వామ్యయుతంగా జరిగేందుకు అధికారపార్టీ నాయకుల కుట్రలను అడ్డుకునేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. చంద్రబాబు అబద్ధాల పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు.

వారికి కరువు కనిపించదు..

తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నా సీఎం చంద్రబాబుబుకు కరువు కనిపించదని బుగ్గన విమర్శించారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే చంద్రబాబు, లోకేశ్‌తో పాటు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం పలువురు పార్టీ క్రీయాశీలన కార్యకర్తలకు ఆయన ఐడీ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు బుగ్గనను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పోస్ట్‌ ప్రసాద్‌, దినేష్‌ గౌడ్‌, సుకన్య, పుల్లాయి, వెంగళ్‌రెడ్డి, పాలుట్ల రఘురాం, మహేంద్ర, షేక్షా, దేవ, అక్బర్‌ బాషా, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు అబద్ధాల పాలనతో

ప్రజలు విసిగిపోయారు

కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో

గుణపాఠం తప్పదు

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement