కొత్తపల్లి: శ్రీశైలం జలాశయంలో రోజురోజుకు నీటి మట్టం తగ్గుముఖం పడుతుండటంతో సప్తనదుల సంగం వద్ద వెలిసిన సంగమేశ్వరుడు జలాధివాసం వీడుతు న్నారు. సోమవారం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగుల నుంచి 849 అడుగులకు చేరుకుంది. దీంతో ఆలయం ముఖమండపం కింది భాగం వరకు, ఆలయ ముఖద్వారం రెండు అడుగుల మేర కిందికి కృష్ణాజలాలు చేరాయి. మరో 8 అడుగుల మేర నీటిమట్టం తగ్గితే పూర్తిస్థాయిలో సంగమేశ్వరాలయం జలాధీవాసం వీడనుంది. కృష్ణాజలాలు తగ్గుతుండడంతో కృష్ణా జలాల నుంచి ప్రాచీన సంగమేశ్వరాలయం బయల్పడుతోంది.


