సాహసం.. ఆశల సేద్యం | - | Sakshi
Sakshi News home page

సాహసం.. ఆశల సేద్యం

Oct 6 2026 1:36 AM | Updated on Oct 6 2026 1:36 AM

కరువు రక్కసి భయపెడుతోంది.. ఆకాశంలో ఎండలు మండుతున్నాయి. కనుచూపు మేర పచ్చదనం లేదు. అయినా.. రైతుల్లో ఏదో ఒక ఆశ. పట్టు వదలని విక్రమార్కుడిలా రైతులు పంట సాగుకు సిద్ధమయ్యారు. వరుణ దేవుడు కరుణించక పోతాడా.. అన్నట్లుగా అరకొరగా అదను అయినా పొలంలో జొన్న విత్తనం వేస్తున్నారు. ఇటీవల తుపాన్‌ ప్రభావంతో జిల్లాలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఎ. కోడూరు గ్రామంలో షేక్‌ ఖాశీం రైతు కూడా జొన్న విత్తనం వేశాడు. ట్రాక్టర్‌ బాడుగలు తాళలేక ఆటోకు సాలు దున్నుడు పరికరాన్ని అమర్చి జొన్న విత్తనం వేసిన పొలాన్ని చదరం చేశాడు. ఇతనిలానే ఎంతో మంది రైతులు రబీలో జొన్న సాగు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పచ్చని వరి పైర్లతో కళకళలాడాల్సిన కేసీ ఆయకట్టులో ఈ ఏడాది వర్షాధారం కింద పంటలు సాగు చేయాల్సి వస్తోంది. – బండిఆత్మకూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement