● ఆలూరు నియోజకవర్గంలోని ఎకై ్సజ్‌స్టేషన్ పరిధిలో గడచిన రెండు సంవత్సరాల్లో 118 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న 137 మందిపై కేసులు నమోదు చేసి 1,387 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
● కోడుమూరు ఎకై ్సజ్‌స్టేషన్ పరిధిలో 2025లో పది కేసులు నమోదు చేసి 15 మందిని అరెస్టు చేసి, 610 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
● ఎమ్మిగనూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 152 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడ్డ ఘటనకు సంబంధించి 74 కేసులు నమోదు చేసి 879 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాకుండా బెల్టు షాపుల నిర్వహణకు సంబంధించి 53 కేసులు నమోదు చేశారు. 2026లో 81 కేసులు నమోదు కాగా, కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న వారిపై 39 కేసులు నమోదు చేసి 690 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
● ఆదోని నియోజకవర్గ పరిధిలో 2025లో 487 కేసులు నమోదు చేసి 339 మందిని అరెస్టు చేశారు. 3,617 లీటర్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని 30 వాహనాలను సీజ్ చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. 2026లో 82.35 లీటర్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
● కోసిగి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గడిచిన రెండేళ్లలో 63 కేసులు నమోదు చేసి 269 మందిని అరెస్టు చేశారు. 1098 లీటర్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు.


