● అధికార పార్టీ నాయకుల ఇళ్లల్లో
పారిశుద్ధ్య కార్మికుల వెట్టిచాకిరి
డోన్: చిన్న మల్కాపురం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో పని చేస్తున్న 16 మంది పారిశుద్ధ్య కార్మికులకు గత 11 నెలలుగా వేతనాలు మంజూరు కాకపోవడంతో ఆర్ధాకలితో అలమటిస్తున్నారు. వారి వెతలు పట్టని టీడీపీ నాయకులు తమ సొంత ఇళ్లలో పనులకు కూడా కార్మికులనే వినియోగించుకుంటున్నారు. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని కొందరు నేతలు కార్మికులను భయపెట్టి తమ ఇళ్లను శుభ్రం చేయించుకుంటున్నారు. నేతల మాట వినకుంటే విధుల నుంచి తొలగిస్తారనే భయంతో వెట్టిచాకిరి చేయాల్సి వస్తుందని కొందరు కార్మికులు చెబుతున్నారు.


