నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా మనీషా | - | Sakshi
Sakshi News home page

నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా మనీషా

Oct 6 2026 1:36 AM | Updated on Oct 6 2026 1:36 AM

నంద్యాల(అర్బన్‌): నంద్యాల సబ్‌ కలెక్టర్‌గా మనీషా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్‌డీఓ విశ్వనాథ్‌ను అమరావతి సచివాలయంలో రిపోర్ట్‌ చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించినట్లు సమాచారం. ఐఏఎస్‌ అధికారిణి అయిన మనీషా మొదటి సారిగా సబ్‌ కలెక్టర్‌గా నంద్యాలలో విధులు నిర్వహించనున్నారు. బాధ్యతలు తీసుకున్న మనీషాను ఆర్‌డీఓ కార్యాల య అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ రాజకుమారిని కలిసి పూల మొక్కను అందజేశారు.

నాలుగు ట్రావెల్స్‌ బస్సులకు రూ. 6.18 లక్షల జరిమానా

డోన్‌ టౌన్‌: రోడ్‌ టాక్స్‌ చెల్లించకుండా ఏపీలో తిరుగుతున్న నాలుగు ట్రావెల్స్‌ బస్సులకు రూ.6.18 లక్షల జరిమానా విధించినట్లు డోన్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌ప్సెక్టర్‌ క్రాంతికుమార్‌ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమ వారం తెల్లవారుజాము వరకు జాతీయ రహదారిపై చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా హైదరాబాద్‌ నుంచి కేరళకు వెళ్తున్న కళ్లాడ ట్రావెల్స్‌, లఖింపూర్‌ నుంచి బెంగళూరుకు వెళుతున్న గోల్డెన్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌, గోరంట్ల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సుధీర్‌ ట్రావెల్‌ బస్సుపై ఒక్కొక్క బస్సుకు రూ.1.46 లక్షల చొప్పున, హైదరాబాద్‌ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న ధనుంజయ ట్రావెల్స్‌ బస్సుపై రూ.1.80 లక్షల జరిమానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు. ఈ నాలుగు బస్సులను ఆపి తనిఖీలు చేయగా ఏపీకి చెల్లించాల్సిన రోడ్డు ట్యాక్స్‌ చెల్లించకుండా తిరుగుతున్నట్లు గుర్తించి జరిమానాలు విధించినట్లు తెలిపారు.

పీజీఆర్‌ఎస్‌కు 107 వినతులు

బొమ్మలసత్రం: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 107 వినతులు అందాయి. ఈ సందర్బంగా అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ ఖాదర్‌బాషా మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వెంటనే సంభంధిత అధికారితో మాట్లాడి సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించామన్నారు. మరికొన్ని ఫిర్యాదులను ఆయా స్టేషన్‌ అధికారులకు బదిలీ చేశామని వివరించారు. ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

యూపీఎస్‌సీ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ

నంద్యాల(అర్బన్‌): బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికార అధికారిణి జాకీర్‌హుసేన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్టీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులు దరఖాస్తును ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు స్వయంగా వచ్చి అందించాలన్నారు. అభ్యర్థుల ఎంపిక ఈనెల 27న స్క్రీనింగ్‌ టెస్ట్‌ ప్రాతిపదికన చేపడతామని, ఎంపికై న అభ్యర్థులకు విజయవాడలో శిక్షణనిస్తారన్నారు. శిక్షణా కాలంలో ఉచిత బస, వసతి సౌకర్యాలను కల్పిస్తామన్నారు. దరఖాస్తుకు ధ్రువీకరణ పత్రాలు జతపరిచి నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు 9849906013ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement