నంద్యాల – ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో పెరిగిన రద్దీ
పగటి వేళల్లో రైళ్లున్నా ప్రయోజనం శూన్యం
ప్రధాన స్టేషన్లలో ఆగని రైళ్లు
తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు తాత్కాలిక స్టాపింగే
కోవెలకుంట్ల: నంద్యాల – ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రైలు ప్రయాణం సులభతరం కాగా అరకొర రైళ్ల రాకపోకలతో ఉమ్మ డి కర్నూలు, వైఎస్సార్ జిల్లాల ప్రజలకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. పగటి వేళల్లో రైళ్ల రాకపోకలు అరకొరగా ఉండగా పలు స్టేషన్లలో స్టాపింగ్ లేకపోవడం, రాత్రి వేళ్లల్లో నడిచే రైళ్ల సమయం అనువుగా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైళ్ల రాకపోకలు ప్రారంభమై పదేళ్లు కావస్తున్నా ప్రయాణికుల సౌకర్యార్ధం రైళ్ల సంఖ్య పెంచకుండా రెండు జిల్లాల ప్రయాణికులను రైల్వే శాఖ నిరుత్సాహ పరుస్తోంది. రోడ్డు మార్గం కంటే రైలు ద్వారా ప్రయాణం సులభతరం కావడంతో నంద్యాల, వైఎస్సార్ జిల్లాల ప్రజలు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సు, ఇతర మార్గాల కంటే రైలు ప్రయాణంపై వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్గంలో రోజు వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా రైళ్లు నామమాత్రంగానే ఉండటంతో ఆయా జిల్లాల ప్రజలు నిరాశ చెందుతున్నారు.
జిల్లాలో ఆగని తిరుపతి ప్రత్యేక రైలు..
నాందేడ్ నుంచి బయలుదేరే ఈ రైలు చర్లపల్లి, పిడుగురాళ్ల, మార్కాపురం, నంద్యాలకు గురువారం ఉదయానికి నంద్యాల చేరుకుని అక్కడి నుంచి బనగానపల్లె, కోవెలకుంట్ల, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మీదుగా తిరుపతి చేరుకుంటుంది. అయితే జిల్లాలోని నంద్యాల మినహా మిగతా ఐదు స్టేషన్లలో ఆగదు. తిరుగు ప్రయాణంలో శుక్రవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తిరుపతి నుంచి బయలు దేరి అదే రోజు రాత్రి 7.40 గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది. అయినా ప్రధాన స్టేషన్లు అయిన బనగానపల్లె, కోవెలకుంట్ల స్టేషన్లలో స్టాపింగ్ లేదు. ఇదిలాఉంటే ప్రతి రోజు నడుస్తున్న తిరు పతి ఎక్స్‌ప్రెస్ రైలుకు కోవెలకుంట్ల, జమ్మలమడు గు స్టేషన్లలో శాశ్వత స్టాపింగ్ సౌకర్యం లేదు. ఆయా స్టేషన్లలో ప్రయాణికుల రద్దీకనుగుణంగా తాత్కాలి క పద్ధతిన ప్రతి ఆరునెలలకొకసారి స్టాపింగ్‌ను రెన్యువల్ చేస్తుండటం విచారకరం.
నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మధ్య దూరం: 130 కి.మీ
స్టేషన్లు : నంద్యాల, మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, నొస్సం, ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు,
ఎర్రగుంట్ల


