ఒత్తిడిని జయిస్తే విజయం సొంతం | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడిని జయిస్తే విజయం సొంతం

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

గోస్పాడు: వైద్య విద్యార్థులు ఒత్తిడిని జయిస్తే విజయం సొంతమవుతుందని నంద్యాల మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సురేఖ అన్నారు. ఈనెల 10వ తేదీన ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా మంగళవారం నంద్యాల మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు తమ వృత్తి పరమైన లక్ష్యాలను సాధించడంలో మానసిక ఆరోగ్యం ఎంతో కీలకమన్నారు. నిరంతరం ఒత్తిడితో కూడుకున్న విద్యలో మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలన్నారు. మానసిక వ్యాధు ల విభాగాధిపతి డాక్టర్‌ లోకేశ్వరనాథరెడ్డి మాట్లాడుతూ.. పరీక్షల భయాన్ని తట్టుకొని నిలబడాలన్నారు. విద్యార్థులు రోజు వారి జీవన శైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం, మొబైల్‌ ఫోన్లకు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. తగినంత సమయం, విశ్రాంతి తీసుకోవడం, నిద్రపోవడం వంటివి చేయాలని, అలాగే క్రీడల్లో పాల్గొనడం కూడా మానసికంగా ఇబ్బందులకు గురి కాకుండా చేస్తుందన్నారు. ఆందోళనకు గురి కాకుండా ప్రణాళిక బద్ధంగా ఎలా చదవాలో వివరించారు. అనంతరం విద్యార్థులకు మానసిక వ్యాధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కళావతి, ఇతర విభాగాల డాక్టర్లు ఇక్రముల్లా, నిరంజన్‌తో పాటు వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement