బరిలో నిలిచే అభ్యర్థులకు ఇబ్బందులు కలిగించొద్దు | - | Sakshi
Sakshi News home page

బరిలో నిలిచే అభ్యర్థులకు ఇబ్బందులు కలిగించొద్దు

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

మ్యానువల్‌గా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

నంద్యాల(న్యూటౌన్‌): రాబోయే మున్సిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇబ్బందు లు ఎదురవకుండా కుల ధ్రువీకరణ పత్రాలను మ్యానువల్‌గా జారీ చేయాలని నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సర్వర్‌ సమస్య, సాంకేతిక కారణాలు తలెత్తితే సకాలంలో పత్రాలు అందే పరిస్థితి ఉండదని, మ్యానువల్‌గా కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు మంగళవారం కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ పీపీ నాగిరెడ్డి, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి తదితరులతో కలిసి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రాజకుమారిని కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కాట సాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతుందన్నారు. సంబంధిత అధికారులు సర్వర్‌ సమస్య, సాంకేతిక కారణాల వల్ల ఆన్‌లైన్‌లో కులధ్రువీకరణ పత్రాలు దరఖాస్తులు స్వీకరించడం, జారీ చేయడం సాధ్యం కాని సమయంలో మ్యానువల్‌ ద్వారా ధ్రువీకరణ పత్రా లు అందేలా చూడాలన్నారు. సరైన సమయానికి అభ్యర్థులకు అవసరమైన పత్రాలు అందకపోతే పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నా రు. ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మాట్లాడుతూ.. అధికా రులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభ్యర్థులకు కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం కానుండటంతో ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వారి వెంట వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు కల్లూరి రామలింగారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ సీనియర్‌ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, నంద్యాల పార్లమెంట్‌ కార్యదర్శి సద్దల సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్‌ దాల్‌మిల్‌ అమీర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు మద్దూరు సుమంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ట్రెజరర్‌ మధుమోహన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement