స్థానిక ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టండి

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

● జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

● జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల(న్యూటౌన్‌): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణకు సంబంధించి జిల్లాలో ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి మున్సిపల్‌, పంచాయతీ, జిల్లా పరిషత్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో స్థానిక సంస్థల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై డీఆర్‌ఓ రాము నాయక్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ సుధాకర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న, డీపీఓ ఫణికుమార్‌ నాయక్‌ తదితరులతో సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ.. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (జెడ్పీటీసీ) ఎన్నికలకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్ల జాబితాల పరిశీలన, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పన, పోలింగ్‌ సిబ్బంది గుర్తింపు, శిక్షణ, ఎన్నికల సామగ్రి సమీకరణ, స్ట్రాంగ్‌ రూమ్‌లు, డిస్ట్రిబ్యూషన్‌–రిసెప్షన్‌ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్‌ బాక్సు లు, ఇతర అవసరమైన పరికరాల లభ్యతను ముందుగానే నిర్ధారించుకుని, వాటి భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement