గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని
మారుమూల గ్రామాలలో సైతం వలంటీర్లు కులమతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సేవలు అందించాం. కానీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్‌కళ్యాణ్‌లు పలు సభల్లో వలంటీర్లను తీసివేయమని, పైపెచ్చు నెలకు రూ.5 వేల నుంచి రూ.10వేలు ఇస్తామని హామీలు గుప్పించారు. తీరా చూస్తే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వలంటీర్లను విధుల నుంచి తొలగించి మా బతుకులపై కొట్టారు. ఇప్పుడే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్ల పేరుతో ప్రజాధనం దోచిపెట్టడం సరికాదు.
– రాణి, మాజీ వలంటీర్, గువ్వలకుంట్ల


