ఉమ్మడి జిల్లాలో రబీ సీజన్‌లో శనగ ప్రధాన పంట. శనగ పంటలో దిగుబడి బాగా రావాలంటే చలి ఎక్కువగా ఉండాలి. మంచు కురవాలి. చలి, మంచు ఎక్కువగా ఉంటే దిగుబడి మెరుగ్గా ఉంటుంది. ఈ సారి ఎల్‌నినో ప్రబా వం వల్ల చలికాలంలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ సంస్థ ప్రకటిస్తోంది. శనగ సాగు చేసే రైతులు ఎల్‌నినో, రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాలి. ఇతర పంటలకు చలి వాతావరణం అవసరం ఉండదు. ఎల్‌నినో ప్రబావం వల్ల రబీ సాగు ప్రశ్నార్థకం అవుతోంది.
– సుజాతమ్మ, ప్రధాన శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం, కర్నూలు


