రహ‘దారుణం’ | - | Sakshi
Sakshi News home page

రహ‘దారుణం’

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

పక్షం రోజులకే కొత్త రోడ్డుకు ప్యాచులు

నాణ్యతకు తిలోదకాలు

హొళగుంద: ఈ చిత్రంలో కనిపిస్తున్న రోడ్డు పాతది కాదు కొత్తదే. నెల రోజుల్లోపే తారు, కంకర లేచి గుంతలు పడడంతో మళ్లీ అతుకులు వేసి ఇలా తయారు చేశారు. హొళగుంద – ఢణాపురం మార్గంలో దాదాపు 25.49 కి.మీ వరకు రూ.11.30 కోట్ల నిధులతో హొళగుంద నుంచి హెబ్బటం ఒక బిట్‌గా, హెబ్బటం నుంచి ఢణాపురం వరకు మరో బిట్‌గా విభజించి కాంట్రాక్టర్లు తారు రోడ్డు పనులు చేపట్టారు. అయితే హెబ్బటం– ఢణాపురం వరకు తారు రోడ్డు పనులు ఒక పక్క జరుగుతుండగా మరో పక్క రోడ్డు గుంతలు పడి దారుణంగా తయారవడం మొదలెట్టింది. వేసిన పక్షం రోజులకే కంకర, తారు లేచి పోయిందంటే పనుల్లో నాణ్యత ఏ మేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇది మొదటి లేయర్‌ అని, మరో లేయర్‌ వేయాల్సి ఉందని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. పటిష్టత లేని రోడ్డుపై ఎన్ని అతుకులు వేసినా, ఎన్ని లేయర్లు వేసినా మన్నికగా ఉంటుందా అనే సందేహం కలుగుతోంది. ఈ పనులను పరవేక్షించాల్సిన ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement