ఆదోని: ఆలూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిపై అక్రమంగా నమోదుచేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బెయిల్‌కు సంబంధించి ఏపీ హైకోర్టులో బుధవారం వాదోపవాదాలు జరిగాయి. ఎమ్మెల్యే తరఫు న్యాయవాదులు పొన్నవోలు ప్రభాకర్, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార కార్యదర్శి జీవన్‌సింగ్ తమ వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించిన అంశాలపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఆ రోజున జరిగే విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మహానంది విద్యార్థుల ప్రతిభ
మహానంది: మహానంది వ్యవసాయ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారని అసోసియేట్ డీన్ డాక్టర్ సీహెచ్ శ్యామ్‌రాజ్ నాయక్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అఖిల భారతస్థాయి వ్యవసాయ ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరచారన్నారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షల్లో వివిధ కేటగిరీ ర్యాంకుల్లో మహానంది విద్యార్థులు ర్యాంకులు సాధించారన్నారు. కీటకశాస్త్ర విభాగంలో భవిత 6వ ర్యాంకు, సోషల్ సైన్స్ విభాగం కేటగిరీలో అమృత 8వ ర్యాంకు, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో శ్వేత కేటగిరీ 19వ ర్యాంకు, మొక్కల జీవ సాంకేతిక విజ్ఞాన విభాగంలో భార్గవి కేటగిరీ 22వ ర్యాంకు, మనోహర్ కేటగిరీ 23వ ర్యాంకు సాధించారన్నారు. అంతే కాకుండా వీరిలో కొంత మందికి జూనియర్ పరిశోధనా ఉపకార వేతనం పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో పాటు విద్యార్థి నిఖిల 9.3 గ్రేడ్ పాయింట్ల సగటుతో విశ్వవిద్యాలయ పరిధిలో 13 ప్రభుత్వ అనుబంధ కళాశాల విద్యార్థుల్లో మొదటి స్థానం సాధించడం గర్వకారణమని, ఆమెకు బంగారు పతకం రూ.5 వేలు నగదు బహుమతి అందించినట్లు తెలిపారు. ప్రవేశాలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన హరికృష్ణ, ఐజయ్య, మోహన్ మురళీ, శ్రేయ, 2026–27 విద్యా సంవత్సరానికి గాను భారతదేశంలోనే ప్రముఖ ప్రఖ్యాతి గాంచిన ఐఐటీ జోధాపూర్, గౌహతిలలో ప్రవేశించి పీహెచ్‌డీ విద్యను అభ్యసిస్తున్నారన్నారు. వీరికి నెలకు రూ. 38 వేలు ఉపకార వేతనం అందుతుందన్నారు. అయేషా మున్నీ భారతదేశ విజ్ఞాన సంస్థ బెంగళూరులో ప్రవేశించి నెలకు రూ. 42 వేలు ఉపకార వేతనాన్ని అందుకుంటుందన్నారు. ఈ విద్యార్థులు అందరూ నాలుగేళ్ల డిగ్రీ విద్యా అనంతరం డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలో ప్రవేశాలు పొందారని వివరించారు.
నిఖిల ఐజయ్య హరికృష్ణ


