అట్టహాసంగా క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా క్రీడా పోటీలు

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

నంద్యాల(న్యూటౌన్‌): ఉమ్మడి జిల్లా పరిధిలో ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్‌ హైస్కూల్లో హ్యాండ్‌బాల్‌, చెస్‌, టేబుల్‌ టెన్నిస్‌ ఎంపిక పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించినట్లు ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ సుధాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం జరిగిన ఎంపిక పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి క్రీడాకారులు హాజరై ప్రతిభ చాటుకున్నారు. హ్యాండ్‌బాల్‌, చెస్‌, టేబుల్‌ టెన్నిస్‌లో జిల్లా స్థాయి ఎంపికలు, నందికొట్కూరు నవనంది హైస్కూల్‌లో జూడో ఎంపికలు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి ప్రభాకర్‌, శ్రీనాథ్‌ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ సుధాకర్‌, శశికళ, కర్నూలు జిల్లా సెక్రటరీ లక్ష్మయ్య, అరుణతో పాటు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్‌, మాజీ సెక్రటరీ శివకుమార్‌ పాల్గొని ఎంపికల ప్రక్రియను పర్యవేక్షించారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు, అధ్యక్షుడు జోసెఫ్‌ లక్ష్మయ్య పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement