పీజీఆర్‌ఎస్‌ అర్జీలను గడువులోగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌ అర్జీలను గడువులోగా పరిష్కరించాలి

Sep 29 2026 12:51 AM | Updated on Sep 29 2026 12:51 AM

● జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌

నంద్యాల(న్యూటౌన్‌): పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జేసీ వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌ ద్వారా 299 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అధికారుల పీజీఆర్‌ఎస్‌ లాగిన్‌లలో ఇప్పటివరకు 135 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే ఓపెన్‌ చేసి పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్స్‌ ద్వారా జిల్లాలో మొత్తం 158 దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయ సేవలకు సంబంధించి 3, అడంగల్‌ సవరణలకు 17, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22–ఏ భూములకు సంబంధించి 18, అసైన్డ్‌ భూములు, భూ ఆక్రమణలకు సంబంధించి 25, రెవెన్యూ కోర్టు విచారణలు, ఆర్‌ఓఆర్‌కు సంబంధించి 53, సర్వే, రీ–సర్వేలకు సంబంధించి 35, దేవదాయ, వక్ఫ్‌ భూములకు సంబంధించి 7 దరఖాస్తులు ఉన్నట్లు జేసీ వివరించారు. రెవెన్యూ క్లినిక్స్‌లో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాము నాయక్‌, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి ఉమామహేశ్వరి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement